TRINETHRAM NEWS
  • జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ..

గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల పరిధిలోని ఎల్కూర్ గ్రామంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితమ్మ సహకారంతో మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం క్రింద 45 లక్షల రూపాయల నిధులతో గ్రామంలో పలు వీధులలో సిసి రోడ్లు పనులకు జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ చేతులమీదుగా కొబ్బరికాయ కొట్టి పూజ చేసి పనులను ప్రారంభించారు..

ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ మాట్లాడుతూ…

గ్రామంలో సరైన రోడ్లు లేకపోవడంతో పురవీధులలో మురుగునీటి సమస్యతో బాధపడుతున్న విషయం తన దృష్టికి తీసుకు రావడంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తు జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ సిసి రోడ్లు పనులకు శ్రీకారం చుట్టి నట్లు తెలిపారు… గద్వాల నియోజకవర్గంలోని ప్రతి గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తరపున కృషి చేస్తానన్నారు…

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ బాబు, అల్వాల రాజశేఖరరెడ్డి, శేక్షావలి,పెదొడ్డి రామకృష్ణ,సద్దనోముపల్లి గోపాల్, ఎల్కూర్ తిమ్మప్ప,నరసింహులు,జంగం శేఖరయ్య,ఆర్.నాగరాజు, విజయ్ తదితరులు ఉన్నారు..