TRINETHRAM NEWS

కుక్కల దాడిలో 24 గొర్రెపిల్లలు మృతి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
కుక్కల దాడిలో 24 గొర్రెపిల్లలు మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండల పరిధిలో చోటుచేసుకుంది. గొర్రెల కాపరి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… మహబూబ్ నగర్ జిల్లాముషణపేట్ మండలం, జనంపేట్ గ్రామానికి చెందిన పల్లి వెంకట రాములు నవాబుపేట్ మండల పరిధిలోని గుబ్బడి పత్తేపురు గ్రామంలో గొర్రెలను మేపటానికి రావటం జరిగిందని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నకాల సమయంలో కుక్కలు గొర్రె పిల్లలపై దాడి చేసి 24 గొర్రెలను కొరికి చంపడం జరిగిందని తెలిపారు. ప్రాణప్రయస్థితిలో ఉన్న గొర్రెలను గుబ్బడి పత్తేపూర్ గ్రామంలోనే ఉన్న పశువుల ఆసుపత్రికి తీసుకువెళ్ళుదామంటే పశువుల ఆస్పత్రి మూసి ఉండటంతో ఏమి తోచక నిస్సహాయ స్థితిలో గొర్రెల కాపరి ఉండటం జరిగిందన్నారు.

పశువుల వైద్యులు ఒకవేళ ఉంటే కొన్ని గొర్రెలైనా బ్రతికేటివని గ్రామస్తులు ఆరోపించారు. ఈ పశువుల డాక్టర్ గ్రామంలో పశువుల ఆసుపత్రికి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళతారో అర్థం కావడంలేదని పేర్కొన్నారు. గ్రామంలో పశువుల ఆసుపత్రి ఉన్న ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పశువుల వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గొర్రెల యజమాని తీవ్ర నష్టం ఏర్పడిందని అన్నారు. ప్రాణప్రతితో కొట్టుమిట్టాడుతూ గొర్రె పిల్లలు ప్రాణాలు విడవడం జరిగిందన్నారు. మహబూబ్ నగర్ వాసి బ్రతుకుతెరువు కోసం ఇక్కడికి వస్తే ఇలాంటి సంఘటనలు జరగటం ఆ కుటుంబానికి తీరని లోటు అని తెలిపారు. గొర్రెల కాపరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు, గ్రామస్తులు తెలిపారు. పశువుల ఆసుపత్రిలో వైద్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App