19 వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం
రేణిగుంట మండలం, పనీరు కాల్వ , SR పట్టేడ గ్రామాలలో ఈ రోజు ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే Biyyapu Madhusudhan Reddy చేస్తున్న అవినీతి,అక్రమాలను , దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ది కి సహకరించాలని కోరడం జరిగింది.
గ్రామంలో డ్రైనేజ్ కాలువలు, స్ట్రీట్ లైట్లు సమస్యలు గ్రామస్థులు తెలిపారు. ప్రభుత్యం అధికారంలోకి వచ్చిన 3-6 నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల ఉపాధ్యక్షులు వాకాటి బాలాజీ , నాయకులు కోబాకు ముని కుమార్ , భాస్కర్ బాబు , భాగ్య లక్ష్మి, అనురాధ, శ్రీనివాసులు, లోకనాధం , మాజీ ఎంపీటీసీ జయలలిత, నాదముని , తోట గణేష్, రవి కుమార్ రెడ్డి ,పేట చంద్ర , సురేష్ , రాజేష్ , గురవయ్య , చిరంజీవి , జ్యోతి రామ్ , బాబు , జనసైనికులు గోవర్ధన్ , మోహమద్ అలి, సాయి పవన్ ,ధనుష్ తదితరులు పాల్గొన్నారు.