17.81 tmcs water storage in Ellampalli project at a constant level…..District Collector Koya Harsha
*ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 16,081 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
*నంది పంప్ హౌస్, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ద్వారా 16,081 క్యూసెక్కుల ఔట్ ఫ్లో
అంతర్గాం, జూలై-29: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 16,081 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, నంది పంప్ హౌస్, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ద్వారా అదే స్థాయిలో నీటిని పంపిణీ చేస్తున్నామని, ఎల్లంపల్లి ప్రాజెక్టు లో స్థిరంగా 17.81 టీఎంసీల నీటి నిల్వ ఉందని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు
సోమవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష అంతర్గాం మండలం లోని ఎల్లంపల్లి రిజర్వాయర్ ను సందర్శించారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తున్న వరద వివరాలు, ఔట్ ఫ్లో, ప్రాజెక్టులో నీటి నిల్వ తదితర అంశాల ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి కడెం ప్రాజెక్టు నుంచి 8 వేల 203 క్యూసెక్కులు , స్థానిక క్యాచ్ మెంట్ ఏరియా నుంచి 7 వేల 879 క్యూసెక్కులు మొత్తం 16 వెల 081 క్యూసెక్కుల వరద ఇన్ ఫ్లో వస్తుండగా, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై కు 331 క్యూసెక్కుల నీటిని, నందీప్ పంప్ హౌస్ ద్వారా 15 వేల 750 క్యూసెక్కుల వరదను ఎత్తిపోస్తున్నామని, ప్రాజెక్టులో మొత్తం 17.81 టీఎంసీల నీటి నిల్వ స్థిరంగా ఉందని ,ఎల్లంపల్లి రిజర్వాయర్ 62 గేట్లు మూసి ఉన్నాయని తెలిపారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర అధికారులు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వరదను అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App