
అమరావతి ఉద్యమానికి 1,500 రోజులు.. 25న వెలగపూడిలో బహిరంగ సభ
తుళ్లూరు : రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు అన్నదాతలు చేస్తున్న సుదీర్ఘ ఉద్యమం ఈ నెల 25వ తేదీకి 1,500 రోజులు పూర్తిచేసుకోనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని…
ఆ రోజు వెలగపూడిలో బహిరంగసభను నిర్వహించాలని అమరావతి ఐకాస నాయకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రత్యేక నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతిని దెబ్బతీస్తున్న వైకాపా ప్రభుత్వంపై యుద్ధానికి రాజధాని రైతులు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రానికి సంపద కేంద్రమైన అమరావతి ఆవశ్యకతను, రాజధానితో రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉన్న విధాన్ని బహిరంగసభలో రైతులు వివరించనున్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల్ని, మద్దతుదారుల్ని ఆహ్వానించనున్నారు. త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తామని అమరావతి ఐకాస సమన్వయ కమిటీ సభ్యులు శనివారం రాత్రి వెల్లడించారు..
