తెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లు రూ.230 కోట్లతో అభివృద్ధి పనులు ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ మారనున్న రైల్వేస్టేషన్ల రూపరేఖలు ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 26న తెలంగాణలో పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన/ప్రారంభోత్సవం చేయనున్నారు. రాష్ట్రంలో రూ.230 కోట్లకు పైగా నిధులతో 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ.169 కోట్లకుపైగా నిధులతో 17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ లను నిర్మించనున్నారు. రూ. 221.18 కోట్లతో పూర్తిచేసిన మరో 32 రైల్ ఫ్లై ఓవర్/రైల్ అండర్ పాస్ లను జాతికి అంకితం చేయనున్నారు. తెలంగాణలో 40 రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని భావించిన రైల్వేశాఖ మొత్తం రూ.2,245 కోట్ల నిధులను కేటాయించింది. 2023 ఆగస్టులో 21 అమృత్ భారత్ స్టేషన్లలో రూ. 894 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 15 అమృత్ భారత్ స్టేషన్లలో రూ. 230 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర సహకరిస్తుండటం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ప్రధాని మోదీకి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రైల్వేల రూపురేఖలను సమూలంగా మార్చివేస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్లు కేటాయించిన నిధులు ..జడ్చర్ల రూ.10.94 కోట్లు ..గద్వాల్ రూ.9.49 కోట్లు ..షాద్ నగర్ రూ.9.59 కోట్లు ..మేడ్చల్ రూ.8.37 కోట్లు ..మెదక్ రూ.15.31 కోట్లు ..ఉందా నగర్ రూ.12.37 కోట్లు బాసర రూ.11.33 కోట్లు ..యాకుత్ పుర రూ.8.53 కోట్లు ..మిర్యాలగూడ రూ.9.50 కోట్లు ..నల్గొండ రూ.9.50 కోట్లు ..వికారాబాద్ రూ.24.35 కోట్లు ..పెద్దపల్లి రూ.26.49 కోట్లు ..మంచిర్యాల రూ.26.49 కోట్లు ..వరంగల్ రూ.25.41 కోట్లు ..బేగంపేట రూ.22.57 కోట్లు
తెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లు
Related Posts
రాష్ట్ర డీజీపీ డా. జితేందర్ ఐపీస్ చేతుల మీదుగా రామగుండము ట్రాఫిక్ ఎసిపి కు ప్రశంసాపత్రం
TRINETHRAM NEWS రాష్ట్ర డీజీపీ డా. జితేందర్ ఐపీస్ చేతుల మీదుగా రామగుండము ట్రాఫిక్ ఎసిపి కు ప్రశంసాపత్రం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండము ట్రాఫిక్ ఎసిపి జే.నరశింహులు లో పరకాల పోలిస్ స్టేషన్ లో సిఐ గా పని చేస్తున్నప్పుడు…
జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో కుష్టు వ్యాధుల గుర్తింపు కార్యక్రమము ను పురస్కరించుకొని
TRINETHRAM NEWS జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో కుష్టు వ్యాధుల గుర్తింపు కార్యక్రమము ను పురస్కరించుకొని పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమంలో నిర్వహించడం జరిగినదని…