కొత్త ఏడాది ప్రారంభం.. నిమిషానికి 1,244 బిర్యానీలు
ఒక్కరోజులో ఓయోలో 6.2 లక్షల బుకింగ్స్‌కొత్త ఏడాది సందర్భంగా ఆర్డర్ల వెల్లువ..
కొత్త ఏడాది ప్రారంభంలో జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ అండ్ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు రికార్డుస్థాయిలో ఆర్డర్లను బట్వాడా చేశాయి..
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 4.8 లక్షల బిర్యానీ ప్యాకెట్లు డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. ప్రతి నిమిషానికి 1,244 ఆర్డర్లు వచ్చాయని పేర్కొంది..
చివరి గంటలో సుమారుగా 10 లక్షల మంది స్విగ్గీ యాప్‌ను ఉపయోగించారని ఆ కంపెనీ సీఈఓ రోహిత్ కపూర్ తెలిపారు. కొత్త సంవత్సరం వేడుకల సమయంలో ప్రతి గంటకు 1,722 యూనిట్ల కండోమ్స్ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ తెలిపింది. అదేవిధంగా డిసెంబరు 31న రెండు లక్షల కిలోల ఉల్లిపాయలు, 1.80 లక్షల కిలోల బంగాళాదుంపలు ఆర్డర్ చేసినట్లు పేర్కొంది. నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా ఓయో రూమ్ బుకింగ్స్ కూడా రికార్డుస్థాయిలో జరిగాయి. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 37శాతం (6.2 లక్షల) రూమ్ బుకింగ్స్ జరిగాయి. కేవలం డిసెంబరు 30, 31 తేదీల్లోనే 2.3 లక్షల ఓయో రూమ్స్ బుక్ అయ్యాయి. అయోధ్యలో గ