
మంగళగిరి
రామనాధం ఆశ్రమంలో 104వ ఉచిత నేత్ర శిబిరం
50 మందికి ఉచితంగా కళ్లజోళ్ల పంపిణీ
మంగళగిరిలోని రామనాధం చినకోటయ్య శివపార్వతమ్మ వృద్ధుల సేవాశ్రమంలో ఆదివారం ఆశ్రమ అధ్యక్షుడు రామనాధం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 104వ నేత్ర పరీక్ష శిబిరం జరిగింది
నేత్ర పరీక్షలు చేయించుకుని, కళ్ళజోళ్ళు అవసరం ఉన్న 50 మందికి ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు
శ్రీ రాధాకృష్ణ యోగ శిక్షణా కేంద్రం వ్యవస్థాపకుడు పడమట రాధాకృష్ణ యోగి గురూజీ పాల్గొన్నారు
యోగ సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని యోగ గురువుగా మంగళగిరి పరిసర ప్రాంతాలలోని ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్న రాధాకృష్ణ యోగి గురూజీని ఆశ్రమ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు సత్కరించారు
ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ దీపాల సాంబశివరావు, గుంటూరు అభయ ఆంజనేయ దేవాలయం వ్యవస్థాపకుడు రామనాధం బాలకృష్ణ, డాక్టర్ రామనాధం నాగ భార్గవి తదితర స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు
