చేవెళ్ల నియోజకవర్గానికి పది కోట్ల 40 లక్షల నిధులు మంజూరు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ చేవెళ్ళ శాసనసభ్యులు కాలే యాదయ్య. చేవెళ్ల నియోజకవర్గం 5 మండలలకు సీఆర్ఆర్ లోని ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుండి 10 కోట్ల 40 లక్షల నిధులు మంజూరు అయ్యాయని స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య” తెలియజేసారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కాలే యాదయ్య” మాట్లాడుతూ చేవెళ్ళ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధిలో భాగంగా పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి సీతక్క చొరవతో రూ.10 కోట్ల 40లక్షల సీఆర్ఆర్ SCSPనిధులు మంజూరయ్యాయి అని అన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల ప్రజలు హర్షం చేసారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App