TRINETHRAM NEWS

1/70 యాక్ట్ ను పరిరక్షిస్తాం, ఆదివాసీ చట్టాలను అమలుచేయటానికి, రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది – యం. వి. వి. ప్రసాద్

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్ ( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : యాక్ట్ 1/70 మార్చే ఎలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు. 1/70 యాక్ట్ ను పరిరక్షిస్తాం. ఆదివాసి చట్టాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. జీవో నెంబర్ 3 ను తీసుకువచ్చి గిరిజనులకు గిరిజన ప్రాంతాల్లో 100% ఉద్యోగాలు కల్పనకు తీసుకొచ్చిన జీవో, ఈ జీవో గత ప్రభుత్వంలో రద్దు అయ్యింది.
ఈ జివో ను పునరుద్ధరణ చేసి గిరిజనులకు అండగా ఉంటామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామి ఇచ్చారు. గిరిజనుల ఆత్మగౌరవం, చట్టాలను గౌరవిస్తామని, కూటమి ప్రభుత్వం లో గిరిజనులకు హాని, తలపెట్టే ఏ పని చేయమని ముఖ్యమంత్రి హామి ఇచ్చారు.
కావున గిరిజన సోదరులు అందరూ ఆలోచన చేయాలని, ఆందోళన చేందవద్దు అని తెలియజేస్తున్నాను. గిరిజనులకు మెరుగైన సంక్షేమం అందిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగు పరిచేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది అని, యం. వి. వి.మీడియా ముందు తెలియచేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

1/70 to protect the