TRINETHRAM NEWS

నారా లోకేశ్‌కు క్రిస్మస్ గిఫ్ట్‌లు పంపించిన వైఎస్ షర్మిల.. ఇది దేనికి సంకేతం..?

ఎవరూ ఊహించని రీతిలో షర్మిల వార్తల్లో నిలిచారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఆమెకు క్రిస్మస్ గిఫ్ట్‌లు పంపించారు.

షర్మిల పంపిన కానుకలను ఫొటో తీసి ట్విట్టర్‌లో పెట్టిన లోకేశ్.. అద్భుతమైన గిఫ్ట్‌లు పంపించినందుకు షర్మిలకు థ్యాంక్స్ చెప్పడంతోపాటు.. ఆమెకు నారా కుటుంబ సభ్యులందరి తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

తన సోదరుడు వైఎస్ జగన్‌కు ప్రత్యర్థి అయిన నారా లోకేశ్‌కు షర్మిల క్రిస్మస్ కానుకలు పంపించడం ఆశ్చర్యం కలిగించింది…

ఇటీవలే జగన్ పుట్టిన రోజు జరుపుకోగా.. చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు కానీ.. లోకేశ్ మాత్రం విష్ చేయలేదు. షర్మిల కూడా ట్విటర్ వేదికగా తన సోదరుడికి బర్త్ డే విషెస్ చెప్పలేదు…