Yesterday’s violence against a child in Sultanabad
హత్య, బాధాకరం వలస మహిళా కార్మికులకు ప్రతేకచట్టాలు సంరక్షణ కలిపించాలి. చట్టాలు కఠినగా అమలు చేయాలి
రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమారపు లావణ్య డిమాండ్
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో
ఆసిఫాబాద్ వలస కార్మికుల ఆరేండ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసిన నిందితుని
కఠినంగా శిక్షించాలని రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమారపు లావణ్య డిమాండ్ చేశారు ఇకముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చేర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన చిన్నారులపై, మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిత్యం ఇలాంటి సంఘటనలు ప్రతిచోట జరుగుతూనే ఉన్నాయని అన్నారు. కామంతో కళ్ళు మూసుకొని వయసుతో సంబంధం లేకుండా అత్యాచారలకు పాల్పడడమే కాకుండా హతమార్చడం బాధాకరమని అన్నారు.
పక్క దేశాల చట్టాలను మన దేశంలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు చిన్నారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, చిన్నారి కుటుంబానికి రాష్ట్ర మహిళా మోర్చా పక్షాన ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాము అని చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని సోమారపు లావణ్య రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ చిన్నారికి శ్రద్ధాంజలి ఘటించడం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App