TRINETHRAM NEWS

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
Trinethram News : ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కుంట గ్రామములో శ్రీ సిద్ధార్థ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులతో అజల్స్ సంస్థ నిర్వహణలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ నందు విద్యార్థులు నిశ్శబ్దాన్ని చేదిద్దాం, ఎయిడ్స్ పై చర్చిద్దాం, అంటూ మరియు టేక్ ద రైట్స్ పాత్, మై హెల్త్ మై రైట్ అంటూ నినాదాలు చేస్తూ అలాగే అక్కడ అక్కడ మానవహారాలు ఏర్పరుస్తూ కుంట గ్రామములోని మూడు రోడ్ల యందు తిరగటం జరిగింది ఈ కార్యక్రమము కుంటలో ఉన్న గ్రామస్తులకు మరియు కుంటకు వచ్చే ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమములో విద్యార్థులు స్కూల్ అధ్యాపకులు సిబ్బంది అలాగే అజయ్ సంస్థ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App