We will continue the ambitions of Comrade Parsa Satyanarayana, the founder of the Singareni mine labor movement
పెద్దపల్లి జిల్లా
గోదావరిఖని
త్రినేత్రం న్యూస్ (ప్రతినిధి)
సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో, శ్రామిక భవన్ గోదావరిఖనిలో కామ్రేడ్ పర్స సత్యనారాయణ తొమ్మిదవ వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది, ముఖ్య అతిథిగా హాజరైన బ్రాంచి కార్యదర్శి మెండె శ్రీనివాస మాట్లాడుతూ, సింగరేణి గని కార్మిక ఉద్యమ నిర్మాత తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ పర్స సత్యనారాయణ 2015 మే 22న చనిపోవడం జరిగిందని, ఆయన సింగరేణిలో 1944లో 19 సంవత్సరాల వయసులోనే క్లర్కుగా ఆయిల్ ఐసూర్ గా పనిచేస్తూ అప్పుడున్న నిర్బంధ కాలంలోనే యూనియన్ కార్యక్రమాలను నడుపుతూ, కార్మికులకు ఏ అవసరం వచ్చినా కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మేనేజ్మెంట్ కు రహస్యంగా లెటర్ ద్వారా వినతి పత్రాలు ఇవ్వడం, కార్మికుల సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాడని, ఇలాంటి పరిస్థితులలో కార్మికులను ఐక్యం చేయడంలో పోరాటాలు నిర్వహిస్తున్న క్రమంలో యాజమాన్యం కక్ష సాధింపులో భాగంగా డిస్మిస్ చేసినప్పుడు, కార్మికులు స్వచ్ఛందంగా కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తే, యాజమాన్యం దిగొచ్చి మళ్ళీ డ్యూటీ లోకి తీసుకున్న నాయకుడని ఆయన తెలియజేశారు, ఆరోజుల్లో ఆడవాళ్లు పిల్లలు అందరు కూడా కాంట్రాక్ట్ కార్మికులగా పనిచేస్తున్నప్పటికీ కాంటాక్ట్ రద్దు కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి విజయం సాధించిన మొట్టమొదటి నాయకుడని అన్నారు, ఆయన ఆశల సాధన కోసం సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు పని చేస్తుందని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మేదరి సారయ్య, సిఐటియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, బ్రాంచ్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, ఏ శంకరన్న, వంగల శివరాం రెడ్డి, జె మల్లేష్, టీ శ్రీనివాస్, ఎస్ శ్రీనివాస్, శివరామకృష్ణారెడ్డి, బీమా, కాంటాక్ట్ కార్మికులు పాల్గొన్నారు,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App