వివేకానంద జయంతి సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మద్గుల్ చిట్టంపల్లి శ్రీ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొన్న సీనియర్ ప్లేయర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటయ్య గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. గత 20 ఏళ్ల క్రితంసీనియర్ల ఆధ్వర్యంలో ఎంతోఅద్భుతంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించేవాళ్ళమని తెలిపారు. అదేఆనవాయితిని నేటియువకులు కూడానిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. వాలీబాల్ ఆడిన ఎంతోమంది గ్రామ యువకులు నేడు కానిస్టేబుల్, ఇతర ఉద్యోగాల్లోస్థిరపడడంజరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వాలీబాల్ ప్లేయర్స్, ఉద్యోగులు నేటి తరం యువకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App