TRINETHRAM NEWS

Prices of vegetables have skyrocketed

Trinethram News : వర్షాలు ఆగాయి.. వరదలు తగ్గాయి. సామాన్యుడికి కష్టాలు పెరిగాయి. వరద నష్టం కూరగాయలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కూరగాయల ధరలు కొండెక్కాయి.సామాన్యులు కొనే పరిస్థితి లేకుండా పోతుంది.
భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల పంట నష్టపోవడంతో.. దిగుబడి తగ్గింది. దీంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి.. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు సెంచరీకి చేరువయ్యాయి.

ఈసీజన్‌లో అందరికి అందుబాటులో ఉండే కూరగాయాలు, ఆకుకూరల ధరలు.. భారీ వర్షాల కారణంగా పెరిగిపోయాయి. ముందుముందు.. మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారస్థులు చెబుతున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిసాయి.

దీంతో కూరగాయల సాగు దెబ్బ తీసింది. గణనీయంగా కూరగాయల దిగుబడి తగ్గింది. చాలాచోట్ల కూరగాయల తోటలు మునిగిపోయాయి. మరికొన్ని కోట్ల వరదలకు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో అన్ని రకాల కూరగాయాల ధరలు నలభై శాతం వరకు పెరిగాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Prices of vegetables have skyrocketed