Trinethram News : రాబోయే ఎన్నికలు.. చంద్రబాబుకు ప్రజల మధ్య జరిగే యుద్ధమని అన్నారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబు పాలన, జగన్ పాలన బేరీజు వేసుకుని ఓటు వేయాలని ప్రజలను కోరారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తేనే వాలంటీర్లు ఇంటికొచ్చి పెన్షన్ ఇస్తారని చెప్పారు.
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏడో రోజు చిత్తూరు జిల్లాలో కొనసాగింది. అమ్మగారిపల్లె నుంచి బయల్దేరిన ఏపీ ముఖ్యమంత్రి యాత్రకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అమ్మగారిపల్లె నైట్ స్టే పాయింట్ దగ్గర సీఎం జగన్‌ను అన్నమయ్య, చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు కలిశారు. కుప్పంకు చెందిన సుబ్రమణ్యంనాయుడు, కృష్ణమూర్తి, బేతప్ప వైసీపీలో చేరారు. కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సీఎం జగన్ బస్సుయాత్ర మతుకువారిపల్లెకు చేరుకుంది. దారిపొడవునా సీఎం జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మధ్యమధ్యలో తనను కలిసేందుకు వచ్చిన వారితో మాట్లాడారు సీఎం జగన్. పెరాలసిస్ బాధితుడు ముఖేశ్‌కు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.