తెలంగాణ జిల్లాల్లో ఇద్దరు కానిస్టేబుల్ లో ఆత్మహత్య?
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొల్చారం పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ చెట్టుకు ఉరి వేసుకునే ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున వాకింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు
మరో సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో బెటాలియ న్ కానిస్టేబుల్, బాలకృష్ణ కుటుంబంతో సహా ఆత్మ హత్యయత్నం చేశారు. బాలక్రిష్ణ. పురుగుల మందుతాగిన తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు
అయితే ముందుగా కానిస్టేబుల్ భార్యకు నీళ్లలో ఎలుకల మందు, ఇచ్చి తర్వాత పిల్లలకు పాలల్లో పురుగుల మందు కలిపి ఇచ్చారు బాలక్రిష్ణ. కుటుం బ సభ్యులకు విషమిచ్చిన తర్వాత ఉరివేసుకుని బాలక్రిష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు.
కాగా, భార్య, పిల్లలు అప స్మారక స్థితిలో ఉండటం చూసి స్థానికులు వారిని చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇక రెండు సంఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App