అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు…
Trinethram News : Mangalagiri : మంగళగిరి మెయిన్ బజార్ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద స్థానిక కాశి అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం జరిగింది. అమరజీవి విగ్రహానికి ట్రస్ట్ ప్రతినిధులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు కర్నాటి శివ సత్యనారాయణ, పెరుమాళ్ళు సుబ్రహ్మణ్యం, పంచల శివన్నారాయణ, కోరంపల్లి హనుమంతరావు, న్యాయవాది విజయకుమార్, మాజేటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App