TRINETHRAM NEWS

భారతదేశ ఆర్థిక దార్శనికుడు మన్మోహన్ సింగ్ కి ఘన నివాళి.
Trinethram News : స్థానిక తేజ టాలెంట్ పాఠశాల ఉపాధ్యాయులు, డాక్టర్: శ్రీ మన్మోహన్ సింగ్ మరణాన్ని చింతిస్తూ, మౌనం పాటించి, సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి సంస్కరణల రూపశిల్పిగా పేరు ప్రఖ్యాతలుగాంచి, తాను మౌనంగా ఉండి దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు తెలియపరిచిన దార్షనీకుడు శ్రీ మన్మోహన్ సింగ్ ని తెలియజేశారు. దేశం రాజకీయంగా, ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయాన దాదాపు పది సంవత్సరాల కాలం పాటు ప్రధాన మంత్రిగా పనిచేసి దేశం యొక్క స్థితిగతులను మార్చి చక్కటి సంస్కరణలతో ప్రతిష్టపరిచిన వ్యక్తిగా ప్రిన్సిపల్ ఎం అప్పారావు అభివర్ణించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App