TRINETHRAM NEWS

గిరిజనుల జోలికొస్తే సహించం
కూటమి ప్రభుత్వము ,స్పీకర్ వాక్యాలు పై స్పష్టమైన వైఖరి తెలపాలి… ఆదివాసి నాయకుడూ పొద్దు బాలదేవ్.

అల్లూరిజిల్లా అరకులోయ, త్రినేత్రం న్యూస్. ఫిబ్రవరి 8: అరకులోయ మండల కేంద్రము లో పత్రిక ముఖంగా,పెసా కమిటీ కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ, 1/70 చట్టాన్ని సవరించాలని స్పీకర్ అయ్యన పాత్రుడు వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్వష్టమైన వైఖరి ప్రకటన చేయాలని, షెడ్యూల్ ఏరియాలో 100 శాతం ఉద్యోగ పుఆధ్యాయ నియామక చట్టం చేయాలని, ఆదివాసీ స్పెషల్ డీఎస్పీ నోటిపికేషన్ ప్రకటించాలని, పాడేరు మెడికల్ కాలేజీలో స్థానిక ఆదివాసులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11,12 తేదీల్లో 48 గంటల రాష్ట్ర మన్యం బందుకు ఆదివాసి అఖిలపక్ష ప్రజాసంఘాలు పిలుపునిచ్చారు.
ఈ బంద్ కు అరకువేలి మండల పెసా కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు శుక్రవారం మీడియా సమావేశం ద్వారా తెలిపారు.ఆదివాసీ హక్కులు చట్టాలు జోలిస్తే సహించేదని చెప్పారు.రాజ్యాంగ బద్ధమైన శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు ఆదివాసీ చట్టాలను కాపాడాల్సింది పోయి టూరిజం అభివృద్ధికి ఆదివాసీ చట్టాలు అడ్డు వస్తున్నాయని చెప్పడం సరికాదన్నారు.వెంటనే ఆయన ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో పెసా కమిటీ ఉపాధ్యక్షులు కార్యదర్శులు సుంకరి అనద్, ఎం రమేష్, కె జగనాధం, నూతన ప్రసాద్, కె రామన్న, రామారావు, గురుమూర్తి, దాశరది, నాగులు గురు జె సురేష్, అర్జున్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tribalism will not be tolerated