భారీగా పతనమైన టమోటా ధర?
Trinethram News : Andhra Pradesh : డిసెంబర్ 09
టమోటా ధర భారీగా పతనం అయ్యింది.. దీంతో.. రైతుల్లో ఆందోళన మొదలైంది.. బహిరంగ మార్కెట్ ప్రస్తుతం కిలో 20 నుంచి 30 రూపాయల వరకు పలుకుతుండగా.. ఒకేసారి భారీగా పతనమైంది..
టమోటా మార్కెట్‌కు పెట్టింది పేరైన కర్నూలు జిల్లాలోని పత్తికొండ టమోటా మార్కెట్లో ఈ రోజు కిలో టమోటా ధర ఒక్క రూపాయికి పడిపోయింది.. దీంతో, పెట్టుబడు, కిరాయిలు.. ఇలా ఏవీ దక్కకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది..
కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అయితే, హైదరాబాద్ మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతోనే టమోటా ధర తగ్గిందంటు న్నారు వ్యాపారులు.. కానీ, మద్దతు ధర లేదని రైతుల ఆవేదన చెందున్నారు..
నిన్నటి దాకా బయటి మార్కెట్ లో కిలో టమోటా రూ.30 వరకు పలికింది.. కానీ, ఉన్నట్టుండి రూపా యికి పతనం కావడంతో.. ఎంతో కష్టపడి టమోటా పండించి.. మార్కెట్‌కి చేర్చితే.. కనీసం కూలీ డబ్బులు కూడా రావడం లేదు..
టమోటాను మార్కెట్‌కి తరలించే రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతులు కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App