సంఘటనలు
2000: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-2000 (కంప్యూటర్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్) ను విడుదల చేసింది.
జననాలు
1981: పారిస్ హిల్టన్, అమెరికన్ నటి, గాయని.
1983: ప్రీతం ముండే, పార్లమెంటు సభ్యురాలు.
1954: కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపకుడు.
1963: మైఖేల్ జోర్డాన్.
మైఖేల్ జెఫ్రీ జోర్డాన్, అతని మొదటి అక్షరాలతో MJ అని కూడా పిలుస్తారు, అతను ఒక అమెరికన్ వ్యాపారవేత్త మరియు మాజీ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ఆటగాడు. అతను 1980లు మరియు 1990లలో NBAని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాడు, ఈ ప్రక్రియలో ప్రపంచ సాంస్కృతిక చిహ్నంగా మారాడు. జోర్డాన్ NBAలో 15 సీజన్లు ఆడాడు, చికాగో బుల్స్‌తో ఆరు ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు.
1984: సదా, సినీ నటి
మరణాలు
1883: వాసుదేవ బల్వంత ఫడ్కే, బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1845)
1983: పాలగుమ్మి పద్మరాజు, తెలుగు సినీ రచయిత. (జ.1915)
1986: జిడ్డు కృష్ణమూర్తి, భారతీయ తత్త్వవేత్త. (జ.1895)
2022: ఆశావాది ప్రకాశరావు, బహుగ్రంథరచయిత, అవధాని, కవి. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1944)