TRINETHRAM NEWS

To build a revolutionary movement, all people need to be politically active

విప్లవోద్యమ నిర్మాణానికి ప్రజలంతా రాజకీయంగా చైతన్యం కావాలి.

ప్రజల్లో చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని విప్లవకర శక్తులు కొనసాగించాలి.

గోదావరిఖని త్రినేత్రం ప్రతినిధి

తేదీ 09:06:2024 నాడు సీపీఐ ఎం ఎల్ మాస్ లైన్ ప్రజపంథా కరీంనగర్ ఉమ్మడి రాజకీయ తరగతులు అంతర్గాం మండలం ఏక్లాస్పూర్ గ్రామంలో జరిగాయి. ముందుగా రాజకీయ తరగతుల సందర్భంగా CPI ML మాస్ లైన్ ప్రజాపంధా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ జండా ఆవిష్కరించగా మూడు అంశాలపై తరగతులను నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో విప్లవోద్యమం విజయవంతం కావాలంటే ప్రజలంతా చైతన్యమై విప్లవోద్యమ నిర్మాణాన్ని కొనసాగించాలి. ప్రజల్లో చైతన్యవంతం చేసే బాధ్యత విప్లవకశక్తులు కొనసాగించాలి. ప్రజలకు పాలకులపై పార్లమెంటు వ్యవస్థ పై ఉన్న నమ్మకాన్ని వారికి ఉన్న భ్రమలను పటాపంచలు చేయాలి. ఆ బాధ్యతలో భాగంగానే రాజకీయ తరగతులు నిర్వహించాలి.

భారత దేశంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యవంతం చేయాలి. భారతదేశంలో విప్లవోద్యమ విజయవంతం అయినప్పుడే సమ సమాజం అవుతుంది. భారత రైతాంగం కార్మిక వర్గం ఐక్యంగా పోరాడితే అమరులు కలలుగన్న సమాజం సాధ్యమవుతుంది. ఆ దిశగా కార్యకర్తలంతా రాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అమరుల స్ఫూర్తిని కొనసాగిస్తూ భారతదేశంలో బలమైన విప్లవోద్యమ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ ఎం ఎల్ మాస్ లైన్ ప్రజాపందా రాష్ట్ర నాయకులు కే సూర్యo, ఎస్ ఎల్ పద్మ, నందిరామయ్య జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణరెడ్డి, పెద్దపెల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, అంతర్గాం మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న, జిల్లా నాయకులు ఆడెపు శంకర్, మార్త రాములు, గూడూరు వైకుంఠం, గొల్లపల్లి చంద్రయ్య, కోడిపుంజుల లక్ష్మి, కట్ట తేజేశ్వర్, పెండ్యాల రమేష్, డివిజన్ నాయకులు తీగుట్ల రాములు, తూల్ల శంకర్, మార్త రాద, ఎం దేవన్న, ఇనుగాల రాజేశ్వర్, గోర్క శ్రీనివాస్, తీగుట్ల శ్రీనివాస్ కొయ్యడ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The revolutionary forces should continue the program of sensitizing the people.