TRINETHRAM NEWS

వైసీపీ ప్రభుత్వానికి ఇదే చిట్ట చివరి సంక్రాంతి.

చీడ పీడలను భోగి మంటల్లో వేసే తెలుగు ప్రజలు వాటికి వైసీపీ చీకటి జీవో లను, జాబ్ కేలండర్ హామీ పత్రాలను జత పరచండి.

రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే సైకో పాలన పోవాలి… సైకిల్ పాలన రావాలి

  • షేక్.అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి.శ్రీనివాసులు రెడ్డి

తెలుగుయువత నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమలనాయుడు ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట ముందస్తు భోగి మంటలు వేయడం జరిగింది. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సైకో పాలన పోవాలని నినదిస్తూ జాబ్ కేలండర్ హామీ పత్రాలను, చీకటి జీవో లను భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

ఈ సందర్భం గా టిడిపి నేతలు షేక్.అబ్ధుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ……

4ఏళ్ల 8 నెలల వైసీపీ పాలన లో యువత భవిష్యత్తు అంధకారం లోకి వెళ్ళింది. ప్రతీ ఏడాది జాబ్ కేలండర్ విడుదల చేస్తానని, ఉద్యోగాలు ఇస్తామని యువత ను జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేశారు.

2 లక్షల 43 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయకుండా వైసీపీ ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోంది. ఉద్యమించిన యువత పై అక్రమ కేసులు బనాయిస్తోంది, అరెస్టుల కు తెగబడుతోంది.

5 ఏళ్లలో ఒక్క డీఎస్సీ లేదు, ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు, పెట్టుబడులు ప్రభుత్వ అసమర్ధత తో వైసీపీ నేతల తీరు తో వెనక్కి వెళ్తున్నాయి.

ఆడుదాం ఆంధ్ర పేరిట యువత ను మభ్య పెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నాణ్యత లేని ఆట వస్తువుల తో క్రీడా ప్రాంగణాలు, కనీస వసతులు చూపకుండా ఆర్భాటపు ప్రచారాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రం గా మార్చుతోంది.

రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది. ఇష్టారీతిన పోలీసు ఆంక్షల పర్వం సాగుతోంది. వైసీపీ ప్రభుత్వానికి లబ్ది చేకూర్చే చీకటి జీవో లు ఇష్టారీతిన జారీ అవుతున్నాయి.

జిల్లా లో దళితుల పై, సామాన్యుల పై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు, పోలీసులు వేధిస్తున్నారు, ప్రశ్నించే గొంతుకలను వైసీపీ ప్రభుత్వం అణచి వేస్తోంది.

రాష్ట్రాన్ని సైకో ముఖ్యమంత్రి పాలిస్తున్నారు. ప్రజా సమస్యలు పట్టని ఈ ముఖ్యమంత్రి ను గద్దె దించి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉంది.

భోగి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలు తమ ముంగిళ్ళ లో వేసే మంటల్లో జాబ్ కేలండర్ హామీ పత్రాలు, చీకటి జీవో కాపీ లను దగ్ధం చేసి సైకో పాలన కు చరమ గీతం పాడాలని పిలుపు ఇస్తున్నాం.