TRINETHRAM NEWS

చీకటిని తొలగించి వెళుతురిని వెదజల్లనున్న వంచుల గ్రామం.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( జీకేవీధి మండలం ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా, జికే వీధి మండలం, వంచుల పంచాయితీ, వంచుల గ్రామంలో చాలా నెలల తర్వాత కూటమి, ప్రభుత్వం హయాంలో చీకటిని,చీల్చుకొని వెళుతురిని వెదజల్లే వంచుల గ్రామం కాబోతుంది. దీనిలో భాగంగా , వీధి బల్బులు వేయిస్తున్న,సర్పంచ్ వనపల కాసులమ్మ, వైస్ సర్పంచ్ చల్లంగి శ్రీధర్, కూటమి నాయకులు జనసేన పార్టీ, సీనియర్ నాయకులు గుండ్ల రఘు వంశీ పంచాయితీలో ఉన్నటువంటి 17 గ్రామాల వార్డ్ మెంబర్లకు బల్బులు ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమం లో గ్రామస్థులు, కట్టుపల్లి రాంప్రసాద్, పోతురు రాంబాబు, వైసీపీ నాయకులు లొంజా గణపతి,వనపల రాజేష్,అరడ సత్తిబాబు, గసడి నూతన్,బూడిద జానకి, చిట్టిబాబు, కూటమి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App