TRINETHRAM NEWS

వజ్ర వాహనం ప్రధానంగా అల్లర్లు జరిగే సమయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,

త్రినేత్రం న్యూస్ పెద్దపల్లి ప్రతినిధి

ఈ రోజు నూతన సాయుధ దళ (ఎఆర్) కానిస్టేబుళ్ళకు కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఎఆర్ పోలీసు విధులలో బాగంగా అల్లర్ల సమయంలో ఉపయోగించే పోలీస్ వజ్ర వాహనం గురించి అవగాహనా కల్పించడం జరిగింది. రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి అల్లర్లు జరిగే సమయంలో స్మోక్, స్టన్ గ్రైనేడ్ (భారీ శబ్దం తో కూడిన) సెల్స్ ఏవిదంగా ఫైర్ చేయాలనీ స్వయంగా ఫైర్ చేసి వివరించడం జరిగింది.
ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ పోలీస్ వజ్ర వాహనం ప్రధానంగా తీవ్రమైన అల్లర్లు చోటుచేసుకున్న సమయంలో అల్లరి మూకలను చెదరగొట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని పోలీసులకు వజ్రాయుధంలా ఉపయోగపడుతుంది అని అన్నారు. అల్లరి మూకలను చెదరగొట్టేందుకు ఒకేసారి ఈ వజ్రా వాహనం ద్వారా ఏడు సెల్స్ ఉపయోగించి ఫైర్ చేసి పరిస్థితిని చక్క దిద్దడం జరుగుతుందన్నారు. అలాగే శాంతి భద్రతల విధుల్లో ఉన్న పోలీసుల భద్రత దృష్ట్యా ఈ వాహనానికి చుట్టూ, ఇనుప జల్లేడ ఉంటుందని తెలిపారు. అంతేకాదు ఎక్కువగా ఘర్షణలు చోటుచేసుకుంటున్న సమయంలో పోలీసులు అల్లర్లను కట్టడి చేసేందుకు ఈ వాహనంలో 12 మంది సిబ్బంది సైతం ప్రయాణించే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ఏ ఆర్ ఏసిపి సుందర్ రావు, ఆర్ఐ లు దామోదర్, వామనమూర్తి, శ్రీనివాస్, మల్లేశం, సంపత్ లు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App