TRINETHRAM NEWS

The NEET exam scam that is creating sensation all over the country

నీట్ ఎగ్జామ్ జరగడానికి ముందే పేపర్ లీక్.. ?

నీట్ యూజీ 2024 ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు ఆలిండియా ఫస్ట్ ర్యాంక్.. దీనిలో ఏడుగురు హర్యానాకి చెందిన ఒకే ఎగ్జామ్ సెంటర్ వారు కావడం మరియు వారికి 720/720 మార్కులు రావడంతో ఎన్నో అనుమానాలు రేగుతున్నాయి.

అదే సెంటర్లో ఎగ్జామ్ రాసిన జాన్వీ అనే విద్యార్థిని 179 ప్రశ్నలను అట్టెంప్ట్ చేయగా అందులో 163 కరెక్ట్ అయ్యాయి అలా చూసుకుంటే ఆమెకు 636 మార్కులు రావాలి కానీ 720/720 ఎలా వచ్చాయంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఎంతో మంది విద్యార్థులకు సాధ్యం కాని విధంగా 718, 719 మార్కులు వచ్చాయి.. (+4, -1) విధానాన్ని నీట్ ఎగ్జామ్లో ఫాలో అవుతారు.. అలా చూసుకుంటే 718, 719 మార్కులు ఎలా సాధ్యమని నెట్టింట ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఈ నీట్ ఎగ్జామ్ వివాదంపై ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) పరీక్షలో సమయం కోల్పోయినట్లు నివేదించిన అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల 718, 719 మార్కులు వచ్చాయని మరియు ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఉన్నాయి అందువల్ల రెండు ఆప్షన్లు సరైనవిగా ప్రకటించి.. 44 మంది అభ్యర్థుల మార్కులు 715 నుంచి 720కి పెరిగాయని వివరించింది.

కానీ కొంత మంది విద్యార్థులకు 100 పైగా గ్రేస్ మార్కులు కలిపారు.. మరియు ముందుకు జూన్ 14 తారీకు విడుదల చేస్తానన్న ఫలితాలు జూన్ 4వ తారీకు ఎలక్షన్ కౌంటింగ్ రోజు విడుదల చేయటంతో ఎన్నో సందేహాలు లేవనెత్తాయి.

పేపర్ లీక్ అవ్వటం వాళ్ల ఎగ్జామ్ రాసిన ప్రతిభ గల విద్యార్థులు నష్టపోయారని.. వారికి న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులు మరియు తల్లిదండ్రులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The NEET exam scam that is creating sensation all over the country