TRINETHRAM NEWS

తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి అదనపు కలెక్టర్ డి.వేణు

మంథని, నవంబర్ -16: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మండలంలో కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు ఆదేశించారు.

శనివారం అదనపు కలెక్టర్ డి.వేణు మంథని వ్యవసాయ మార్కెట్ యార్డు, మంథని మండలం ఏక్లాస్ పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. ధాన్యం తేమ శాతం రెగ్యులర్ గా చెక్ చేయాలని, 17 శాతం తేమ రాగానే వెంటనే కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు.

కొనుగోలు చేసిన వడ్ల వివరాలను వెంటనే ఓపిఎంఎస్ లో నమోదు చేస్తూ రైతులకు త్వరగా ధాన్యం డబ్బుల చెల్లింపులు జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.

మద్దతు ధర పై నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత మిల్లులకు తరలించాలని, ఎటువంటి ఆలస్యం జరగడానికి వీలులేదని అదనపు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాల దృష్ట్యా పంట నష్టపోకుండా అవసరమైన టార్ఫాలిన్ కవర్లు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App