The meeting of Chief Ministers of Telugu States started at Praja Bhavan
Trinethram News : Hyderabad : 6th July 2024 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది.
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీ శ్రీధర్ బాబు, శ్రీ పొన్నం ప్రభాకర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్, సత్యప్రసాద్, శ్రీ బీసీ జనార్ధన్‌రెడ్డి, ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కార్యక్రమ ప్రారంభంలో శ్రీ రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కాళోజీ నారాయణ రావు రాసిన “నా గొడవ” పుస్తకాన్ని బహుకరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App