శబరిమలకు వెళ్తున్న బస్సును ఢీ కొట్టిన లారీ
Trinethram News : కేరళ : కేరళలోని కొల్లాం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3:45 గంటల ప్రాంతంలో ఆర్యన్కావు గ్రామంలో ఈఘటన జరిగింది. శబరిమల భక్తులతో వెళ్తున్న బస్సును, లారీ ఢీ కొట్టింది. దీంతో బస్సు రోడ్డు పక్కన 40 అడుగుల లోతులోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 16మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App