రాబోయే నాలుగేళ్లలో పేదవాడి సొంతింటి కల నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం
రేగొండ లో ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
రేగొండ మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రాబోయే నాలుగేళ్లలో పేదవాడి సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం చేపట్టినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు శనివారం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండల కేంద్రంలోని స్థానిక ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో రూ.5 లక్షలతో నిర్మించనున్న మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రైతు వేదికలో రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 23 మంది కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు రూ.23,02,668 విలువ కలిగిన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న రూ. ఐదు లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తవుతుందా అనే సందేహం ప్రజల్లో నెలకొన్న నేపథ్యంలో అట్టి సందేహాన్ని నివృతి చేసేందుకే ఈరోజు రూ.5 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అవగాహన కల్పించనునట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసిన రోజు నుండి కేవలం 20 రోజుల్లోనే అన్ని హంగులతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇంటి నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App