TRINETHRAM NEWS

The driver died after being hit by an unknown vehicle

Trinethram News : కొండపాక తిమ్మారెడ్డిపల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీని ఢీ కొట్టిన కారు వ్యక్తి మృతి చెందాడు. ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో లారి వెనకాలే ఉన్న కారు వెనుకవైపు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి శివారులో బుధవారం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా కీసర నాగారం గ్రామానికి చెందిన గుడ్ల చంద్రశేఖర్ 58 కరీంనగర్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. తన సొంత కారులో మంగళవారం కరీంనగర్ వెళ్లి తిరిగి బుధవారం ఉదయం హైదరాబాదుకు వెళుతుండగా తిమ్మారెడ్డిపల్లి శివారులో ముందుగా అతివేగంగా వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయగా వెనుకనే ఉన్న ఆయన కారు కంట్రోల్ కాక లారీకి ఢీకొట్టుకుంది దాంతో ఆయన ఛాతికు స్టీరింగ్ గుద్దడంతో తీవ్ర గాయాల గురై అక్కడి కక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The driver died after being hit by an unknown vehicle