Trinethram News : ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.
పత్రికా ప్రకటన. తేదీ.12.01.2024.
రాత్రి సమయంలో దొంగతనం చేసిన కేసులో నిందితునికి జైలు శిక్ష విధించిన న్యాయస్థానం.
విజయవాడ చిట్టినగర్ కు చెందిన ఫిర్యాది భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో స్వాతీ రోడ్డు, కొండవీడు అకాడమీ సమీపంలో ఒక ఫోటోస్టూడియో నిర్వహిస్తున్నట్లు, ప్రతి రోజు లాగా ది.28.07.2023 తేదిన రాత్రి షాప్ తాళం వేసి ఇంటికి వెళ్ళినట్లు మరుసటి రోజు ఉదయం వచ్చేసరికి షాప్ తాళం పగలగొట్టబడి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు షాప్ లోని కెమెరాలు మరియు లెన్స్ లను దొంగతనం చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదుపై భవానిపురం పోలీస్ వారు Cr.no.651/2022 U/S 457, 380 IPC గా కేసు నమోదు చేసి వారి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.
దర్యాప్తులో భాగంగా ఆధారాలను సేకరించి అనుమానితులపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపధ్యంలో ది.11.08.2023 తేదీన భవానిపురం పోలీస్ వారు తెలంగాణా,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరు పాడు గ్రామానికి చెందిన కారం నరేష్ (33 సం.) అను వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది.
పైన తెలిపిన కేసులో నిందితుడైన కారం నరేష్ (33 సం.) చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ విచారణలో భాగంగా 03 మంది సాక్షులను ప్రాసిక్యూషన్ తరుపున హాజరు పెట్టడం జరిగింది.
విచారణ అనంతరం నిందితుడిపై నేరం ఋజువైనందున ది.11.01.2024 వ తేదీన చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ శ్రీ ఎన్.రాజశేఖర్ గారు నిందితుడైన కారం నరేష్ కు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం జరిగింది.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరుపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ బి.కృష్ణ కిషోర్ గారు, సి.యమ్.ఎస్. ఇనస్పెక్టర్ గారు, భవానిపురం ఎస్.ఐ. శ్రీ. ఎల్.ప్రసాద్ గారు మరియు సి.ఎం.ఎస్. సిబ్బంది గార్ల పర్యవేక్షణలో సాక్షులను కోర్టులో విచారించడం జరిగింది.