Telangana Tribal Federation’s response to the state budget
భూక్య శ్రీనివాస్
భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి
కేవలం పేపరు మీద రాసిన అంకెలను చూసి సంతోషించాల్సిన అవసరం అవి ఖర్చు చేయడంలో పాలకవర్గాలు విఫలమవుతున్నాయి.
భద్రాద్రి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కొత్తగా వచ్చిన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి కూడా ఆదివాసి గిరిజనులకు సంపూర్ణమైనటువంటి బడ్జెట్ ను కేటాయించలేదు పాత పద్ధతిని అవలంబించింది.
@ రాష్ట్ర ప్రతిపాదిత బడ్జెట్ 2.91.191. కోట్లు.
@ కాగా ఆదివాసి గిరిజనులకు జనాభా నిష్పత్తి ప్రకారం @ 29.119 కోట్లు ఆదివాసి గిరిజనులకు చెందాలి.
కానీ ఈరోజు కేటాయింపుల్లో ఎస్టీ, ఎస్డిఎఫ్ కింద 17.05 కోట్లు మాత్రమే. బడ్జెట్లో గిరిజనులకు కోత విధించడం జరిగింది.
1) 500 జనాభా కలిగిన తండాల పంచాయతీలను రెవెన్యూ పంచాయతీల హోదా కల్పిస్తామని ఆర్థిక మంత్రి ప్రసంగంలో పొందుపరచలేదు. ఇప్పటికే చాలా పంచాయతీల్లో నూతన పంచాయితీభవనాలు ఉన్నవి
2) బీటీ రోడ్లు వేసినంతమాత్రాన అభివృద్ధి జరిగినట్టు కాదు. ప్రతి తండా గ్రామపంచాయతీకి కోటి రూపాయల చొప్పున కేటాయించాలి.
3) గత పాలకులు కూడా ఆదివాసి గిరిజన పండుగలను కేటాయించిన కేటాయింపులే ఈసారి చూపించారు
4) ఇంటిగ్రేటెడ్ గురుకులాల్లో ఒకే దగ్గర ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి అభినందనలు కానీ అందులో విద్యార్థుల డిమాండ్ ఉన్నందున సీట్ల సంఖ్య పెంచాలి.
4) ఆదివాసీ గిరిజనులకు బడ్జెట్లో కేటాయించిన నిధులు గత పరిపాలనలో సరియైన పద్ధతిలో ఖర్చు చేయకుండా వేరే వాటికి దారి మళ్లించడం జరిగింది.
కానీ ఈ ప్రభుత్వం కూడా వేరే దారి మళ్ల కుండా చూస్తాం అని అన్నారు కానీ దానికి చట్టం చేయాల్సిన అవసరం ఉంది.
5) రాష్ట్రంలో బిఏఎస్ విద్యా విధానం మెరుగుపరిచి సీట్ల సంఖ్యను పెంచాలి అది ఎక్కడ కూడా మాట్లాడలేదు.
6) తండాల రెవిన్యూ బోర్డును ఏర్పాటు ప్రస్తావన లేదు
7) పోడు భూముల ప్రస్తావన లేదు సాగు చేస్తున్నటువంటి రైతులకు పూర్తిస్థాయిలో హక్కు పత్రాలు ఇంకా చేరలేదు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App