Telangana State Minimum Wage Advisory Council Chairman and INTUC Secretary General Janak Prasad on the order
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు జీడీకే 2A INCLINE గేట్ మీటింగ్ కి ముఖ్య అతిథులుగా P. ధర్మపురి జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి దాసు సెంట్రల్ జాయింట్ జనరల్ సెక్రటరీ ఆరేపల్లి(Tyson)శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా ఆర్జీవన్ వైస్ ప్రెసిడెంట్ కే .సదానందం ఆధ్వర్యంలో, పిట్ సెక్రటరీ పి. సదానందం అధ్యక్షతన లాభాల వాటా ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ
కార్మికుల సమిష్టి కృషి ,INTUC సెక్రటరీ జనరల్ మరియు తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్ గారి కృషి మరియు ప్రభుత్వ సహకారంతో సింగరేణి 2023-24 ఆర్థిక సంవత్సరానికి 70.02 మిలియన్ టన్నుల ఉత్పత్తి 37,500 కోట్ల టర్నోవర్ తో 2412 కోట్ల నికర లాభాలు సాధించినందుకు గాను . మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రజా పాలనలో 33% అంటే 796 కోట్లు కార్మికులకు చెళ్ళించినందుకు గాను
సగటున ఒక్కో కార్మికునికి 1,90,000 /- ప్రకటించినందుకు. రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ కార్మికుల కు 5000 రూపాయల బోనస్ ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి ,శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రామగుండం శాసన సభ్యులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులందరికీ మరియు
ఈ లాభాల వాటా చెల్లింపులో యాజమాన్యానికి ప్రభుత్వానికి అనుసంధానకర్తగా వ్యవహరించిన పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు INTUC సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ కి కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో మైనింగ్ స్టాప్ ఇంచార్జ్ పోతర వేన సమ్మయ్య, సెంట్రల్ నాయకులు బేబీ శ్రీనివాస్, భాస్కర్ కిరణ్ ,బ్రాంచ్ సెక్రటరీలు నీరటి సాగర్ ,నాగరాజు ,గుండేటి శ్రీనివాస్, వివిధ గనుల పిట్ సెక్రటరీలు సిరిపురం నరసయ్య, రాజేశం మరియు ముఖ్య నాయకులు పాకాల సాయి కృష్ణ ,వెంకటేశ్వర్లు, నరేష్, శివ ,మల్లేష్ ,అన్వేష్, తిరుపతి ,ప్రవీణ్, అశోక్ , వెంకటేష్, టి శ్రీనివాస్ ;సిహెచ్ శ్రీధర్ , తదితర నాయకులు మరియు కార్మికులు ఉద్యోగులు మహిళా సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App