TRINETHRAM NEWS

Trinethram News : May 11, 2024,

లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు మద్దతు పెరుగుతోంది. అతణ్ని ఆ టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా ప్రేక్షకుల ముందు అవమానించడాన్ని ఆ టీమ్ ప్లేయర్లే తప్పు పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా లక్నో స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్.. రాహుల్‌కు మద్దతుగా ఇన్‌స్టా పోస్ట్ పెట్టారు. రాహుల్‌తో ఉన్న ఫొటోను పంచుకున్న అతడు ‘బ్లాక్ హార్ట్’ను క్యాప్షన్ ఇచ్చారు. యశ్ ఠాకూర్, మోసిన్‌ ఖాన్‌, యుధ్వీర్ సింగ్ కూడా ఇలాంటి పోస్టులే పెట్టారు.