TRINETHRAM NEWS

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ శిలా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న..కావలి శాసనసభ్యులు

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 7: నెల్లూరు జిల్లా :బోగోలు మండలం. నెల్లూరు జిల్లా..బోగోలు మండలం సోమేశ్వర పురం గ్రామంలో శుక్రవారం ,కామాక్షి దేవి సమేత సోమేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి విగ్రహ శిలా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ,ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు,టిడిపి నాయకులు,గ్రామస్తులు.
అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ,ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ శిలా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని. ఆలయ నిర్మాణం మరియు ప్రతిష్ట కార్యక్రమం దాతలు బచ్చు కృష్ణ కుమార్ బచ్చు సంధ్యా , ఎమ్మెల్యే అభినందించారు.

అమర బచ్చు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మీరు చేస్తున్న సేవ మరవలేనిదని అక్క ఆశయాల కోసం తమ్ముడు చేస్తున్న సేవ అద్భుతం అని అన్నారు స్వామి ఆశీస్సులు కావలి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని,ప్రతి ఒక్కరు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్నారు. కావలి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని,కావలి నియోజకవర్గంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా కాపు కాస్తానని తెలిపారు.సోమేశ్వర పురం ప్రజలు చూపుతున్న అభిమానం ఎనలేనిదని తెలిపారు..ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Subrahmanyeshwar Swami idol