TRINETHRAM NEWS

శ్రీవారి 2023 సంవత్సర హుండీ ఆదాయం 1398 కోట్లు.

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయ వివరాలను వెల్లడించిన టీటీడీ బోర్డ్. 2023 సంవత్సరంలో శ్రీవారి హుండీ ఆదాయం 1398 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రతీ నెలా శ్రీవారి హుండీ ఆదాయం 100 కోట్లు దాటి వచ్చినట్లు తెలిపారు. జూలై నెలలో అత్యదికంగా 129 కోట్లు, నవంబర్ నెలలో అత్యల్పంగా 108 కోట్లు ఆదాయం వచ్చిందని, డిసెంబరు నెలలో 116 కోట్లు ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.