మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనాలు.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్
హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి డిండి మండల కేంద్రము గుండా రోజుకు వందల వాహనాల ద్వారా ప్రయాణం చేస్తుంటారు. ఇక్కడి నుండి శ్రీశైలం దేవస్థాన దర్శనానికి రోజుకు కొన్ని వేల మంది ప్రయాణం చేస్తుంటారు.
వాహనాలు మితిమీరిన వేగంతో రావడం వలన రోజుకు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి డిండి చౌరస్తాలో రోడ్డుకు ఇవతల వైపు నుండి అవతలి వైపుకు దాటాలంటే ప్రాణాలను అల చేతిలో పట్టుకొని దాటాల్సిన పరిస్థితి ఉందని ప్రజలు ఆపోతున్నారు వాహనాలు కొత్తిమీర వేగంతో వస్తున్నాయి.
చిన్నపిల్లలు వృద్ధులు రోడ్డున దాటాలంటే కష్టంగా ఉంది. డిండి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై వాహనాల స్పీడ్ కంట్రోల్ సూచికలు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని డిండి మండల ప్రజలు సంబంధిత అధికారుల ను కోరుతున్నారు.
వేరువేరు ప్రాంతాల్లో శనివారం రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఒకచోట మూడు కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. మరోచోట ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై శనివారం మూడు కాళ్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.
ఈ ప్రమాదంలో కరుమృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను హైదరాబాద్ కు తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App