TRINETHRAM NEWS

75 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మొట్టమొదటి సారి గా బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ శకట ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ వారి ప్రసంశలు అందుకుంది. శకటానికి జ్యూరీ అవార్డు ప్రసంశా పత్రాన్ని జిల్లా రెవిన్యూ అధికారి పి. వెంకటరమణ చేతుల మీదుగా ఛైర్మన్ నారాయణ భట్టు, డి. వి. రమణబాబు జూలగంటి సత్యనారాయణ రాజు అందుకున్నారు.ఈ సందర్భంగా డి ఆర్ ఓ ” రెడ్ క్రాస్ అంకిత భావంతో చేసిన కార్యక్రమాల ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలిచిందన్నారు.