TRINETHRAM NEWS

జిల్లా ఆసుపత్రి వైద్య విభాగానికి ప్రత్యేక అభినందనలు జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*జిల్లా ఆస్పత్రిలో గణనీయంగా పెరిగిన సేవలు

*నవంబర్ నెలలో 25 ఈ.ఎన్.టి., 55 ఆర్థో,22 జనరల్, 18 కంటి శస్త్ర చికిత్స సర్జరీలు

*నవంబర్ నెలలో మాతా శిశు ఆసుపత్రిలో 210 ప్రసవాలు
పెరిగిన పిల్లల ఔట్పేషెంట్ అండ్ ఇన్ఫెషంట్ వైద్య సేవలు

నవంబర్ నెల వైద్య ఆరోగ్యశాఖ పనితీరు వివరాలను వెల్లడించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, డిసెంబర్ -02: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందే వైద్య సేవలు గణనీయంగా పెరిగాయని, దీనికి కృషి చేసిన వైద్య విభాగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు  జిల్లా కలెక్టర్ కోయ హర్ష  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

నవంబర్ నెలలో జిల్లా ఆసుపత్రిలో మొత్తం 10 వేల 539 ఔట్ పేషెంట్ లు, 1289 మంది ఇన్ పేషెంట్లు వైద్య సేవలు పొందారని కలెక్టర్ తెలిపారు. మన జిల్లా ఆసుపత్రిలో నవంబర్ నెలలో కంటి చరిత్ర చికిత్సలు నవంబర్ 22న ప్రారంభించామని, ఇప్పటి వరకు 18 మందికి కంటి శత్రువు చికిత్స సర్జరీలు విజయవంతంగా నిర్వహించామని అన్నారు.

జిల్లాలోని మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో మొత్తం 5 వేల 88 మంది ఔట్ పేషెంట్లు, 667 మందు ఇన్ పేషెంట్లు వైద్య సేవలు పొందారని, నవంబర్ నెలలో మొత్తం 210 ప్రసవాలు విజయవంతంగా  నిర్వహించామని అన్నారు.

జిల్లా ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగం, కంటి శాస్త్ర చికిత్స విభాగం, గైనకాలజిస్టులు, జనరల్ సర్జన్, ఈ.ఎన్.టి , డెంటల్ విభాగంలో నిపుణులైన డాక్టర్లు, అత్యాధునికమైన పరికరాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ సేవలు సైతం అందుబాటులో ఉన్నాయని వీటిని అవసరమైన ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App