సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
జనవరి 7 నుంచి జనవరి 27 వరకు మొత్తం 32 ప్రత్యేక రైళ్లను వివిధ మార్గాల్లో నడపనున్నట్లు తెలిపింది.
సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ , బ్రహ్మపూర్ – వికారాబాద్, విశాఖపట్నం – కర్నూలు సిటీ, శ్రీకాకుళం – వికారాబాద్, సికింద్రాబాద్ – తిరుపతి, సికింద్రాబాద్ – కాకినాడ టౌన్, సికింద్రాబాద్ – నర్సాపూర్ మార్గంలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.