TRINETHRAM NEWS

త్వరలో తెలంగాణ ఆర్టీసీలో 3,039 ఉద్యోగాలు

Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 18
టీజీఎస్ఆర్టీసీలో కొత్తగా 3,039 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయను న్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో వెల్లడించారు.

అసెంబ్లీలో సభ్యులు వివేక్, ఆది శ్రీనివాస్,పాల్వాయి హరీష్,అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ… జిల్లా కేంద్రాలకు లింకు రోడ్లు ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకు న్నామని, తెలిపారు

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు సంతోషంగా ఉచిత ప్రయాణం చేస్తు న్నారని, దీంతో బస్సులకు డిమాండ్ పెరిగిందన్నారు. అందువల్ల రాష్ట్రంలో కొత్త రూట్లను కూడా పెంచుతా మన్నారు వేములవాడ, ధర్మపురి, కొండగట్టు క్షేత్రాల ను కలుపుతూ బస్సుల లింకింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.

రాష్ట్ర ఆవిర్భావం సమ యంలో ఆర్టీసీలో 55,000 మంది ఉద్యోగులుంటే, ప్రస్తుతం 40,000 మంది ఉన్నారని చెప్పారు. 15 ఏళ్లు దాటిన బస్సులను స్క్రాప్‌కు పంపిస్తున్నామ న్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App