జీతాలు జూలై లో పెంచుతాం
Trinethram News : అమరావతి
AP: అంగన్వాడీలు విధుల్లో చేరకుంటే నిబంధనల ప్రకారం కొత్తవారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ‘
అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, పిల్లలకు ఇబ్బంది కలగకూడదనే ఎస్మా పరిధిలోకి తెచ్చాం.
ఈ సమ్మె వెనుక పొలిటికల్ అజెండా ఉంది.
తెగేవరకు లాగకుండా అంగన్వాడీలు సమ్మె విరమించి విధుల్లో చేరాలని మళ్లీ కోరుతున్నాం.
జులైలో జీతాలు పెంచుతాం’ అని ఆయన వివరించారు.
డబ్బులు ఉన్నాయి కానీ జీతాలు ఇవ్వలేరట
అంగన్వాడీలకు ఎన్నికల తర్వాత జీతాలు పెంచుతామని మట్టి ఖర్చులు, గ్రాడ్యుటీలు పెంచుతామని జీతాలు ఐదు సంవత్సరాలు వరకు పెంచకూడదన్న నియమం ఏర్పరచు కొన్నామని అన్నారని పట్టుదలకి పోకుండా విరమించాలని స్పష్టం చేశారని, ఉద్యమం కొనసాగుతుందని అంగన్వాడి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సుబ్బారావమ్మ, బేబీ రాణి, ఎన్ సి హెచ్ సుప్రజ తెలిపారు