TRINETHRAM NEWS

హిందూ మహా సముద్రంలో ఫెంగల్ తుఫాన్: ఏపీలో వర్షాలు..

Trinethram News : అమరావతి

హిందూ మహా సముద్రంలో తాజాగా తుఫాన్ ఏర్పడటమే దీనికి కారణం. ఇక్కడ ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడింది. ఫలితంగా తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.

ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో మరింత బలపడుతుందని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ వెల్లడించింది. వాయుగుండంగా, ఈ నెల 24వ తేదీ నాటికి తుఫాన్‌గా మారుతుందని పేర్కొంది. దీనికి ఫెంగల్ అని పేరు పెట్టింది. ఈ పేరును- సౌదీ అరేబియా సూచించింది.

ఈ సీజన్‌లో సంభవించబోతోన్న మూడో తుఫాన్ ఇది. ప్రస్తుతం ఈ అల్పపీడనం ఇండోనేసియాలోని సుమత్ర- అండమాన్ నికోబార్‌ ద్వీప సమీపంలో కేంద్రీకృతమైంది. క్రమంగా ఇది పశ్చిమ- వాయవ్యం, వాయవ్యం దిశగా కదులుతుందని, వాయుగుండంగా మారుతుందని యూరోపియన్ వెదర్ ఫోర్‌కాస్ట్ తెలిపింది..

ఈ ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో నవంబర్ 23వ తేదీ నాటికి బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ అల్పపీడనం క్రమంగా ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై వాయుగుండంగా మారుతుందని పేర్కొంది..

దీని ప్రభావంతో ఈ నెల 26, 27 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. కాకినాడ, కృష్ణా, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్లతో పాటు రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, శ్రీసత్యసాయి పుట్టపర్తి, దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కంది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App