Rahul Gandhi : కాంగ్రెస్ అంటే బీజేపీకి భయం..నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
Rahul Gandhi : నాగపూర్ – మహారాష్ట్ర లోని నాగపూర్ లో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా చేపట్టారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కేసీ వేణు గోపాల్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు రాహుల్ గాంధీ. ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీని చూసి భయాందోళనకు గురవుతోందని అన్నారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని, ఇప్పటి నుంచే పార్టీకి చెందిన నేతలు, శ్రేణులు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఆ పార్టీకి చెందిన ఎంపీల్లో ఇప్పటి నుంచే భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. ఎంపీల అభిప్రాయాలకు ఆ పార్టీలో విలువ లేదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇందుకు భిన్నంగా ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ కు, బీజేపీకి మధ్య ఉన్న తేడా ఇదేనని పేర్కొన్నారు.
అన్ని వ్యవస్థలను నాశనం చేసిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందని ఎద్దేవా చేశారు.