TRINETHRAM NEWS

Prime Minister Modi’s visit to Dras

నేడు కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం .. ప్రధాని మోదీ ద్రాస్ లో పర్యటన..

Trinethram News : లడఖ్‌ : నేడు కార్గిల్ విజయ్ దివస్(Kargil Vijay Diwas) 25వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) లడఖ్‌(Ladakh)లోని కార్గిల్‌లో పర్యటించనున్నారు..

ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన రజతోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఇక్కడ ప్రధాని మోదీ 1999 యుద్ధ వీరులకు నివాళులర్పిస్తారు. వారి కుటుంబ సభ్యులను కూడా కలవనున్నారు. కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవం సందర్భంగా జులై 24 నుంచి 26 వరకు ద్రాస్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు ప్రధాని మోదీ 2022లో కార్గిల్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు..

ప్రపంచంలోనే ఎత్తైన

కార్గిల్ యుద్ధంలో(kargil war) అమరవీరుల జ్ఞాపకార్థం ఉదయం 9:20 గంటలకు ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద జరిగే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని పీఎంఓ కార్యాలయం తెలిపింది. ఆ తర్వాత షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు. ఈ సొరంగం లేహ్‌కు అన్ని రకాల కనెక్టివిటీలను అందిస్తుంది. పూర్తయిన తర్వాత ఇది ప్రపంచంలోనే ఎత్తైన సొరంగం కావడం విశేషం.

అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారు. ఆ తర్వాత ‘షహీద్ మార్గ్’ (వాల్ ఆఫ్ ఫేమ్)ను సందర్శిస్తారని మేజర్ జనరల్ మాలిక్ తెలిపారు. సందర్శకుల పుస్తకంపై సంతకం చేసి కార్గిల్ యుద్ధ కళాఖండాల మ్యూజియాన్ని పరిశీలిస్తానని చెప్పారు. ప్రధాని మోదీ ‘వీర్ నారీస్’ (యుద్ధంలో అమరులైన సైనికుల భార్యలు)తో కూడా సంభాషించనున్నారు. వీర్ భూమిని కూడా సందర్శిస్తారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Prime Minister Modi's visit to Dras