Trinethram News : పాకిస్థాన్‌లో అణుబాంబు ఉన్నందున మనం భయపడాల్సిందే అంటూ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. శనివారం ఒడిశాలోని కంధమాల్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. పాకిస్తాన్లో అణు బాంబులు ఉన్నాయి అని పదే పదే చెప్పడంపై ముఖ్య ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు. అయితే వాటిని విక్రయించడానికి ఎవరైనా వెతుకుతున్నారా అని అడిగారు. వాటిని కొనుగోలు చేయాలంటే కూడా అందులో సరైన నాణ్యత లేదని ఎద్దేవా చేశారు.
పాకిస్థాన్‌లో అణుబాంబు ఉన్నందున మనం భయపడాల్సిందే అంటూ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. శనివారం ఒడిశాలోని కంధమాల్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. పాకిస్తాన్లో అణు బాంబులు ఉన్నాయి అని పదే పదే చెప్పడంపై ముఖ్య ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు.
అయితే వాటిని విక్రయించడానికి ఎవరైనా వెతుకుతున్నారా అని అడిగారు. వాటిని కొనుగోలు చేయాలంటే కూడా అందులో సరైన నాణ్యత లేదని ఎద్దేవా చేశారు. అందుకే అమ్మడానికి కూడా సాధ్యపడదని చురకలు అంటించారు. నాణ్యమైన అణుబాంబు తయారు చేసేందుకు పాకిస్తాన్ వద్ద అంత ఆర్థిక శక్తి కూడా లేదని పాక్ ఆర్థిక వ్యవస్థపై వ్యంగాస్త్రాలు సంధించారు.
పాత వీడియోను వెలికి తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసి భారతదేశం పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని సూచించడం హేయమైన చర్యగా అభివర్ణించారు ప్రధాని మోదీ. సొంత దేశాన్ని, దేశ ప్రజలను ఏదో ఒక పేరు చెప్పి కాంగ్రెస్ భయపెట్టాలని పదే పదే ప్రయత్నిస్తోందన్నారు. సొంత దేశంలోని వారే ఇలాంటి ఆటంకాలు, అపవాదులు సృష్టించడం సరైన విధానం కాదని హెచ్చరించారు.
ఇలాంటి వాటిని దేశం ఎప్పటికీ మరిచిపోదని ప్రజలు బాగా తెలివైన వారని, అన్నింటినీ గుర్తుంచుకుంటారని సూచించారు. కేవలం ఓటు బ్యాంకు కోసం ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.