TRINETHRAM NEWS

ప్రజా వీరుడు పండుగ సాయన్న కు ఖనిలో ఘనంగా నివాళి….!!

బహుజన వర్గాల ఆశాజ్యోతి పండుగ సాయన్న జీవిత చరిత్రను ప్రచురించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన డాక్టర్ శంకర్ ముదిరాజ్…

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రజా వీరుడు తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి పాలమూరు ముద్దుబిడ్డ పండుగ సాయన్న ముదిరాజ్ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో సాయన్న ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ముదిరాజ్ లు, బిసి కులాల ఐక్యవేదిక నాయకులు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ హాజరై మాట్లాడుతూ, 18వ శతాబ్దంలో ప్రజల పక్షాన పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా నాటి తెలంగాణ దొరలకు వ్యతిరేకంగా, పేద బడుగు బలహీన వర్గాలు కష్టించి దాచుకున్న సొమ్ము, ధాన్యం ఎత్తుకెళ్లిన రజాకారులను ఎదిరించి ప్రజల సొమ్మును గుంజుకొచ్చి తిరిగి ప్రజలకు పంచిన ప్రజా వీరుడుగా నిలిచాడని పండుగ సాయన్న ముదిరాజ్ ముద్దుబిడ్డ బహుజన బంధు, తెలంగాణ రాబిన్ హుడ్ గా చరిత్రలోకి ఎక్కాడని అంత గొప్ప వీరుని చరిత్రను రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ తరాలకు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. పండుగ సాయన్న ఆశయ సాధనలో ముదిరాజులు బిసి బడుగు బలహీన వర్గాలు ఐక్యతగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లా నాయకులు దబ్బెట శంకర్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పిల్లి శివయ్య ముదిరాజ్, పిడుగు కృష్ణ ముదిరాజ్, కోమల్ల మహేష్ ముదిరాజ్, తూడి రాజయ్య, బొజ్జ రాజనర్సు, కేశవ వేణి బిక్షపతి, బోయిని కుమార్, రంజిత్, స్వామి, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App